Share News

పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం

ABN , Publish Date - May 26 , 2026 | 12:32 AM

జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్‌. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం
జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి, అడ్లూరి, నాయకులు

జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్‌. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్‌ సమీ పంలో గల స్థానిక ఓల్డ్‌ హైస్కూల్‌ మైదానం నుంచి పాతబస్టాండ్‌ సర్కిల్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లా డుతూ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించు కోలేదని ఆరోపించారు. దాన్యం కొనుగోలులో ఎఫ్‌సీఐ పూర్తిగా విఫలమైందని, మొక్క జొన్నకు మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుందని విమర్శిం చారు. బంగారం కొనద్దని, పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గించాలని పేర్కొంటున్న మోదీ మాత్రం లక్షల రూపాయల సూట్‌ వేసుకొని దేశాలు తిరుగుతున్నాడని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు నెపంతో ఇష్టారాజ్యంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతున్నారని, ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలతో పబ్బం గడుపుతుందని విమర్శించారు. కాం గ్రెస్‌పై విమర్శలు చేస్తున్న జీవన్‌రెడ్డి, కేంద్రంపై ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

డీసీసీ అఽధ్యక్షుడు గాజెంగి నందయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అబద్దపు హామీలతో కాల యాపన చేస్తున్నారన్నారు. వెలమ కార్పొ రేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగారావు మాట్లా డుతూ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచబోమని మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ మాటత ప్పారన్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు విజయ్‌ ఆజాద్‌ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశప్రజలను నమ్మించిన మోదీ, ఎన్నికలు పూర్తవగానే ధరలు పెంచేశారని ఆరోపిం చారు. సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లా డుతూ కేంద్రప్రభుత్వం 28లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెల గాటం ఆడిందని, నీట్‌పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శ నం అన్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రజలపై భారం మోపడం దారుణం అన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:32 AM