విద్యార్థుల సమస్యలపై ఉద్యమం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:27 AM
విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి పేర్కొన్నారు.
గణేశ్‌నగర్,ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏఐఎస్‌ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. దేశం ధర్మం అంటూ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఏఐఎస్‌ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. బీజేపీ పాలనలో విద్యార్థులకు చేసింది ఏమీలేదని అన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా విద్యార్థులకు కేంద్రం నుంచి తీసుకువచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నగర ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, శ్రావణ్, నవీన్,చిన్న పండు, అభి తదితరులు పాల్గొన్నారు.