వాహనదారులు సీటు బెల్ట్‌ను ధరించాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:09 AM
భారీ వాహనాలను నడుపుతున్న వారందరు తప్పనిసరిగా సీట్ బెల్ట్‌లను ధరించడంతోనే ప్రమాదాలను నివారిం చవచ్చునని జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : భారీ వాహనాలను నడుపుతున్న వారందరు తప్పనిసరిగా సీట్ బెల్ట్‌లను ధరించడంతోనే ప్రమాదాలను నివారిం చవచ్చునని జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ అన్నారు. అరైవ్-అలైవ్ కార్యక్రమం లో భాగంగా గురువారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రగుడు జంక్షన్‌లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌లతో కలిసి సీట్ బెల్ట్‌లపై వాహనాదారులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ భారీ వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీట్ బెల్ట్‌లను పెట్టుకుని వాహనాన్ని నడుపాలని లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పుడు సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వలన ఎయి ర్‌బ్యాగ్స్ ఓపెన్ కావని, తద్వారా ప్రాణనష్టం జరిగే ప్రమదాం ఉందన్నారు. డ్రైవ ర్‌తో పాటు ఇతర సీటులో కూర్చున ప్రయాణికులు కూడా తప్పకుండా సీట్ బెల్ట్‌లను ధరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలను నడువద్దన్నారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సహాయ మోటార్ వాహనాల తనీఖీ అధికారి పృధీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.