వాహనదారులు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:31 AM
వాహనదారులు డ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
ఫ కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు డ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కలెక్టరేట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి... అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. అధిక వేగం ప్రమా దాలకు ప్రధాన కారణమని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడప కూడదన్నారు. వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా ఆర్‌టీఏ మెంబర్ కంటాల శ్రీనివాస్, రవాణా శాఖ, పోలీస్, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ స్థాయిల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.