Share News

ఇక పారదర్శకంగా పౌరసేవలు

ABN , Publish Date - May 01 , 2026 | 12:57 AM

తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఇక పారదర్శకంగా పౌరసేవలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆఫీసులో పత్రాల సమర్పణ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికింది. ఈ సర్వీసుల విభాగం (మీసేవ) జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే కొనసాగనున్నది.

ఫ అధికారుల మొబైల్‌ యాప్‌లోకి నేరుగా డేటా

దరఖాస్తుదారులు మీసేవలో ఆయా ధ్రువీకరణ పత్రాల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకుని అందుకు కావలసిన పత్రాలను అప్‌లోడ్‌ చేసిన డేటా నేరుగా అధికారుల మొబైల్‌ యాప్‌లోకి చేరుతుంది. దానిని సంబంధిత అధికారులు పరిశీలించనున్నారు. కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీ కరణతోపాటు ఈబీసీ, ఓబీసీ వంటి పత్రాల కోసం ప్రజలు ఇకపై పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాల్లో అప్‌లోడ్‌ చేసే పత్రాలనే ప్రామాణికంగా తీసుకొని అధికారులు పరిశీలన పూర్తి చేస్తారు. జీపీవో, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ల వెరిఫికేషన్‌ ప్రక్రియ అంతా మొబైల్‌ ఆప్లికే షన్‌ ద్వారానే జరుగనున్నది. దరఖాస్తు చేసుకున్న నుంచి సర్టిఫికెట్‌ మంజూరు వరకు ప్రతీ దశ డిజిటల్‌ పద్ధతిలోనే సాగనున్నది. కొత్త విధానం అమల్లోకి రావడంతో జిరాక్స్‌ కాపీల ఖర్చు, పైళ్లను పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. గతంలో మీసేవలో అప్లై చేసినా, ఆ కాగితాల (హార్డ్‌కాపీ)ను తహసీల్దార్‌ కార్యాలయంలో అందజే యాల్సి వచ్చేది. అక్కడ వీఆర్వో, ఆర్‌ఐ, డిప్యూటీ తహ సీల్దార్ల ఆమోదం కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. వీరంతా క్షేత్ర పర్యటనలకు వెళితే ఇక అంతే సంగతి. ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి లో సర్టిఫికెట్లు చేతికి వచ్చేవి కావు. ఎంతో కొంత ముడు పులు ఇచ్చిన వారికి, పలుకుబడి గల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు కొందరికి సకాలంలో సర్టిఫికెట్లు ఇచ్చే వాళ్ళు. ఏ పలుకుబడి లేని వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. ఈ క్రమంలో మధ్యవర్తుల ప్రమేయం పెరిగి అవినీతికి ఆస్కారం కలిగేది. తాజా నిర్ణయంతో పారద ర్శకత పెరగడమే కాకుండా సామాన్యులకు సమయం, డబ్బు ఆదా కానున్నాయి.

ఫ కఠిన నిబంధనలు అమలు..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ కార్యాలయాల్లో ఇకపై భౌతిక పత్రాలను స్వీకరించకూడదు. ఎవరైనా అధికారులు, మీసేవ నిర్వాహకులు గానీ పౌరుల నుంచి కాగితాలు కోరినా, వారిని కార్యాలయాలకు రావాలని వేధించినా కఠినచర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిం చింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో యంత్రాంగంలో చలనం మొదలైంది. దీంతో డిజిటల్‌ విప్లవంలో భాగంగా మీసేవ కేంద్రాల నిర్వాహకుల బాధ్యత మరింత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పత్రాల స్కానింగ్‌ అప్‌ లోడింగును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. సాంకేతిక లోపా లు తలెత్తకుండా, దరఖాస్తుల్లో తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యలు ఉన్నప్పటికీ ఈ మార్పు ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడి సామాన్యులకు సేవలు వేగంగా అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 01 , 2026 | 12:57 AM