Share News

మహాలక్ష్మి పథకంతో మహిళలకు మరింత శక్తి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:16 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలకు మరింత శక్తి వచ్చిందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

మహాలక్ష్మి పథకంతో మహిళలకు మరింత శక్తి
మహాలక్ష్మి పథకం అభినందన సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

భగత్‌నగర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలకు మరింత శక్తి వచ్చిందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. తెలిపారు. ఆర్టీసీలో మహాలక్ష్మి కింద 290 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేసి పదివేల కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీల ఆదా చేసుకున్నారు. దీంతో కరీంనగర్‌ బస్టాండ్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 6.91 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి 308.84 కోట్ల రూపాయల లబ్ధి పొందారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందడమే కాకుండా, ఉపాధి, విద్య, వైద్యం వంటి రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థిక అభివృద్ధిలో వినూత్నమైన మార్పు తీసుకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోన్‌ ఈడీ పగిడిమర్రి సోలమన్‌, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ బి రాజు, అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో కె మహేశ్వర్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపారాణి, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు పి మల్లేశం, ఎస్‌ భూపతిరెడ్డి, వన్‌ డిపో మేనేజర్‌ విజయ మాధురి, పర్సనల్‌ ఆఫీసర్‌ సంపత్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

ఫ ముఖ్యమంత్రి ఆలోచన గొప్పది..

- జమున, అంగన్‌వాడీ కార్యకర్త

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసి మహాలక్ష్మి పథకానికి రూపకల్పన చేసి గొప్ప ఆలోచన చేశారు. మహిళలు విద్యార్థులు విద్యా ఉపాధి కోసం ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలందరికీ డబ్బు ఆదా అవుతోంది.

ఫ మహిళల ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర..

- బండారి రేణుక, టీఎల్‌ఎఫ్‌బీ, పట్టణ సమాఖ్య మెప్మా

మహిళల ఆర్థిక అభివృద్ధిలో మహాలక్ష్మి పథకం కీలకపాత్ర పోషిస్తున్నది. మహిళలు, గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆర్టీసీని వినియోగించుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతున్నది.

ఫ డబ్బు ఆదా అవుతోంది..

- మయూరి, నవభారతి మండల సమైక్య అధ్యక్షురాలు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మహిళలందరికీ నెలకు పదివేల వరకు డబ్బు ఆదా అవుతున్నది. ఆ డబ్బును పొదుపు చేయడంతో పాటు కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నాం. మహిళలకు, విద్యార్థులు కూలీలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:16 AM