Share News

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:43 AM

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ముస్తాబాద్‌ మండల బీజేపీ అధ్యక్షుడు సౌల్ల క్రాంతి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి

ముస్తాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ముస్తాబాద్‌ మండల బీజేపీ అధ్యక్షుడు సౌల్ల క్రాంతి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం బైఠా యించారు. ఈసందర్భంగా సౌల్ల క్రాంతి మాట్లాడుతూ గత రెండు సీజన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వేయనందుకు ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని రెండు పంటల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని డిమాం డ్‌ చేశారు. మండలానికి మల్లన్నసాగర్‌ 12వ ప్యాకేజీ కెనాల్‌ ద్వారా నీటిని అందిసూ, పెండింగ్‌లో ఉన్న కెనాల్‌ను మరమ్మత్తు చెయాలని వచ్చే మండుటెం డల్లో రైతుల పొలాలు ఎండిపోకుండా ముస్తాబాద్‌లోని లింగయ్యకుంట ద్వారా సాగునీరు అందించాలని కోరారు. ఈసందర్భంగా తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ నక్కదాసరి రవి, బీజేపీ జిల్లా ఉపాధ్య క్షులు మల్లారపు సంతోష్‌రెడ్డి,జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ మెర్గు అంజాగౌడ్‌, మండ ల ప్రధానకార్యదర్శి ఏదునూరి గోపి, దగ్గు భవిత, నవీన్‌, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు మెంగని మహేందర్‌, వరి వెంకటేశ్‌, కటకం మహేశ్‌, చీకోటి మహేశ్‌, కాసోడి రమేశ్‌, చిట్నేని శ్రీనివాస్‌రావు, బాధ నరేశ్‌, చిగురు వెంకన్న, పొన్నాల సత్యంరెడ్డి, నందం, కనుకయ్య, తిరుపతి పెద్దూరి శ్రావణ్‌, గుడికందుల మహేందర్‌రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:43 AM