Share News

జమ్మికుంట మున్సిపాల్టీలో కాసుల గలగల

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:29 AM

జమ్మికుంట మున్సిపల్‌ ఎన్నికల వేళు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్‌ తీసుకుంటేనే నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

జమ్మికుంట మున్సిపాల్టీలో కాసుల గలగల

జమ్మికుంట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మున్సిపల్‌ ఎన్నికల వేళు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్‌ తీసుకుంటేనే నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. వారిని బలపరిచే వ్యక్తుల పన్నుల బకాయిలు సైతం చెల్లించాలి. పన్నులు చెల్లించే విషయంలో ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజకీయ నాయకులు మున్సిపల్‌ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 31 ఆర్ధిక సంవత్సరం ముగిసేవరకు.. బిల్‌ కలెక్టర్లు ఆస్తి పన్నులకు వెళ్లిన రాజకీయ నాయకులు ఏ మాత్రం పట్టించుకోరు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో తమ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్‌ తీసుకునేందుకు పోటిపడుతున్నారు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది కార్యాలయం ఆవరణలోని వాటర్‌ ట్యాంక్‌, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పన్నుల వసూళ్లలో బిజీ అయ్యారు. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, 28, 29 తేదీల్లో 15 లక్షల మేర బకాయిలు వసూలయ్యాయి.

Updated Date - Jan 30 , 2026 | 12:29 AM