Share News

ఓట్లను తొలగించడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:26 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొన్న ఓటు చోరీ నేడు సీటు చోరీకి పాల్పడిందని ఏఐ సీసీ కార్యదర్శి సచిన్‌ సావత్‌ అన్నారు.

ఓట్లను తొలగించడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొన్న ఓటు చోరీ నేడు సీటు చోరీకి పాల్పడిందని ఏఐ సీసీ కార్యదర్శి సచిన్‌ సావత్‌ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రం కే కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా కాం గ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం స్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యే సమగ్ర సవరణపై బీఎల్‌వోలకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పీసీసీ కార్యదర్శి సచిన్‌ సావత్‌ మాట్లాడారు. స్వాతంత్రం కోసం నాడు కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలు చేసిందని ఇప్పుడు దేశం కోసం పాటుపడుతుం దన్నారు. దేశాన్ని విచ్ఛిన్న చేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధివిధానా లపై మరోసారి ఉద్యమ పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి చేసింది ఏమిలేదన్నారు. నరేంద్రమోదీ దేశ అభివృద్ధిని పక్కన బెట్టి అనునిత్యం రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కు తున్నాడని ఆరోపించారు. 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ జవహర్‌లాల్‌ నెహ్రూతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారతదేశ అభివృద్ధి నాటి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూతోనే జరిగిందని అన్నారు. మోది ప్రభుత్వం దేశంలోని ఓట్లను చోరీ చేస్తుందని ఓట్ల చోరీ మాని ఇకనైన దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో మోదీ ప్రభుత్వ ఈడీ, సీబీ ఐని నమ్ముకొని పరిపాలన చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షలను అనగదొక్కడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటు ప్రజాస్వా మ్యంను ఖూనీ చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి పక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఎన్నికల అధికారులను అడ్డంగా పెట్టుకొని మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరింపజేసి బీజేపీ ప్రభుత్వ సీటు చోరీకి పాల్పడిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం లో బీజేపీ వ్యతిరేక ఓట్లను పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బెంగాల్‌ రాష్ట్రం తరహాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వ్యతిరేక ఓట్ల ను తొలగించాలని బీజేపీ ప్రభుత్వ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సైనికుల్లా పని చేయా లన్నారు. 10సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రజల ను విస్మరించి కేవలం రాజులా ఫౌంహాజ్‌కే పరిమితం అయ్యాడని ఆరోపించారు.

జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుంది : విప్‌ ఆది శ్రీనివాస్‌

రానున్న ఎన్నికలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుందని ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు కలసికట్టుగా సిరిసిల్ల నియోజకవర్గంలో పనిచేస్తే సిరిసిల్ల ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని ప్రశ్నించే గొంతుకలను అణ చివేస్తుందని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లను చోరీ చేస్తుంది విమ ర్శించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సచిన్‌ సావత్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు ఫక్రుద్ధీన్‌, టీపీసీసీ పరిశీలకులు గోపిశెట్టి రాఘవేందర్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాం గ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, ఎస్సీ సెల్‌ జిల్లాల మాజీ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మున్సిపల్‌ కాం గ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, నియోజకవర్గంలోని మా ర్కెట్‌ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:26 AM