ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:15 AM
అధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పోలీసు అధికారులు సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల కు మెరుగైన పోలీస్ సేవలను అందించాలని ఎస్పీ మహేష్ బీ గీతే అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : అధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పోలీసు అధికారులు సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల కు మెరుగైన పోలీస్ సేవలను అందించాలని ఎస్పీ మహేష్ బీ గీతే అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవా రం పోలీస్ అఽధికారులకు సీసీటీఎన్‌ఎస్ వినియోగం, సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కేసుల దర్యాప్తులో ఎస్‌వోపీ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా కేసుల దర్యాప్తును మరింత వేగవంతంగా, నాణ్యతతో చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్‌లో అందుబాటులోకి వస్తు న్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ స్టేషన్లలో కేసులు, నేర సమాచారంతో పాటు ఇతర వివరాల డేటాల నమోదును సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంపొందించేందుకు సీసీటీఎన్‌ఎస్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. నేరాల నియంత్రణ, నేరస్థుల కదలి కలపై పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమర్థవంతంగా పర్యవే క్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోని ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలందించాలని సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఎస్‌వోపీని తప్పనిసరిగా పాటిస్తూ సీసీటీఎన్ ఎస్, ఎన్‌సీఅర్‌పీ, వంటి జాతీయ స్థాయి పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల దర్యాప్తును మరింత వేగవంతంగా, పార దర్శకంగా, ఫలితాల సాధనకు అనుకూలంగా నిర్వహించవచ్చని తెలి పారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్ర మంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు, అర్‌ఐలు, ఎస్‌ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.