విద్యాశాఖలో ఆధునిక పాలనకు శ్రీకారం
ABN , Publish Date - May 09 , 2026 | 02:00 AM
విద్యాశాఖలో ఆధునిక పాలనకు శ్రీకారం చుట్టను న్నారు. పరిపాలనా సేవలన్నీ పూర్తిగా డిజిటల్ విధానం లోనే అందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇటీవల ఆ శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్, జాయింట్ డైరెక్టర్లు సంయుక్తంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలోని టీజీ ఆన్‌లైన్ బృందంతో సమన్వయం చేసుకుని అత్యవసర ప్రాఽధాన్యతతో చర్య లు చేపట్టాలని స్పష్టం చేశారు.
- ఆన్‌లైన్ ద్వారానే ఫిర్యాదులు, అప్పీలు, సెలవులు
- గెజిటెడ్ సేవలన్నీ నూతన విధానంలోనే
- ప్రైవేటు పాఠశాలల ఫిర్యాదులకు మానిటరింగ్ సిస్టం
- సమస్యల పరిష్కారానికి పని చేయనున్న ప్రత్యేక బృందం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
విద్యాశాఖలో ఆధునిక పాలనకు శ్రీకారం చుట్టను న్నారు. పరిపాలనా సేవలన్నీ పూర్తిగా డిజిటల్ విధానం లోనే అందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇటీవల ఆ శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్, జాయింట్ డైరెక్టర్లు సంయుక్తంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలోని టీజీ ఆన్‌లైన్ బృందంతో సమన్వయం చేసుకుని అత్యవసర ప్రాఽధాన్యతతో చర్య లు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైతే డీఈవో, ఎంఈవో స్థాయిలో బీటెక్ అర్హత ఉన్న ముగ్గురు ఉపా ధ్యాయులను ఈ పనుల కోసం రెండు నెలలపాటు వినియోగించుకోవాలని సూచించారు.
ఫ మాన్యువల్ ఎన్‌ఓసీల నిలిపివేత
ఇప్పటికే అమలులో ఉన్న ఉపాధ్యాయుల ఆన్‌లైన్ ఎన్‌ఓసీ మాడ్యుల్‌ను తక్షణమే కస్టమైజ్ చేయాలన్నారు. వచ్చే నెల 12 నుంచి ప్రత్యేక పరిస్థితులు మినహా డీఎస్‌ఈ ముందస్తు అనుమతి లేకుండా మాన్యువల్ ఎన్‌ఓసీలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ఉపాధ్యాయుల మెడికల్, దీర్ఘకాలిక తదితర సెలవులన్నీ ప్రత్యేకమైన డిజిటల్ విధానంలోనే దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాలకు ప్రత్యేకమైన వ్యవస్థ పని చేస్తుంది. ప్రధానోపాధ్యాయులు, డీఎస్‌ఈ అప్పీలేట్ అథారిటీగా ఉన్న కేడర్లకు సంబంధించిన క్రమశిక్షణా కేసులు అప్పీలు స్వీకరణ కోసం ప్రత్యేకమైన మాడ్యూల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుల మానిటరింగ్ సిస్టమ్ ప్రైవేటు పాఠశాలలపై తల్లిదం డ్రులు, ఎన్‌జీఓల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఫిర్యాదుల మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఫిర్యాదుల స్వీకరణ, ట్రాకింగ్, ఎస్కలేషన్ ప్రక్రియలతో తీసుకున్న చర్యల సమాచారాన్ని ఫిర్యాదారుడికి చేరవేస్తారు.
ఫ టీజీ ఆన్‌లైన్‌తో అనుసంధానం
విద్యా శాఖల్లో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల మాడ్యుల్సును టీజీ ఆన్‌లైన్ వ్యవస్థతో సమగ్రంగా అనుసంధానం చేయనున్నారు. అధికారిక పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌ను లింక్ చేయడంతోపాటు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణ అమలు చేయనున్నారు. రియల్ టైమ్ ట్రాకింగ్, స్టాటస్ అప్‌డేట్, అకౌంటబిలిటీ ఫిక్సేషన్ ద్వారా అన్ని కేసులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏడు రోజులలోపు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలి. ప్రతీ శనివారం సాయంత్రం డీఎస్‌ఈ సమావేశం నిర్వహిస్తారు. సం బంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావా లని స్పష్టంచేశారు. ఇకపై డీఎస్‌ఈ, ఆర్జేడీ, డీఈవో, ఎంఈవో కార్యాలయాల ద్వారా ఉపాధ్యాయులకు అం దిస్తున్న ఇతర సేవలను కూడా గుర్తించి వాటిని పూర్తిగా ఆటోమేట్ చేయాలని ఉన్నతాధికారులు సూచిం చారు. సరికొత్త విధానం అమల్లోకి రావడం ద్వారా విద్యాశాఖ పరిపాలనలో పారదర్శకత, వేగం, బాధ్యత, సమర్థత గణనీయంగా పెరుగనున్నాయి.