Share News

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:34 AM

స్పీకర్‌ను అవమానిం చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ధర్నా చేశారు.

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : స్పీకర్‌ను అవమానిం చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ధర్నా చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డు కోవడంతో తోపులాటలు జరిగాయి. అదేసమయంలో మరికొందరు నాయ కులు జిల్లా గ్రంథాలయం కార్యాలయం ఎదుట తాతా మధు దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవ రాజు మాట్లాడారు. మున్సిపల్‌ ప్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి రాగుల జగన్‌, వేముల దామోదర్‌, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, నీలి రవీందర్‌, ప్రధాన కార్యదర్శి నేదురి లక్ష్మన్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్‌, పోచమ్మ దేవాలయం చైర్మన్‌ పరశురాము లు, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, మాజీ కౌన్సిలర్‌ వెంగళ లక్ష్మీనర్స య్య, కత్తెర దేవదాస్‌, మార్కెట్‌ కమిటి మాజీ వైస్‌చైర్మన్‌ బైరా ప్రభాకర్‌, నాయకులు ఎర్రం మల్లయ్య, తుంగ శివరాజు, ధర్మరాజు, కిరణ్‌, రశీద్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:34 AM