ఎమ్మెల్యే కేటీఆర్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:40 AM
అధికారంలో ఉన్నా, అధి కారంలో లేకున్నా సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల బాగోగులు పట్టించు కోని సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు తన పదవికి వెంటనే రాజీ నామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : అధికారంలో ఉన్నా, అధి కారంలో లేకున్నా సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల బాగోగులు పట్టించు కోని సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు తన పదవికి వెంటనే రాజీ నామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ కనబడడం లేదని, సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకోని కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడారు. గత శాసన సభ ఎన్నికలలో రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల రుణం తీర్చు కుంటానని ఇక నుంచి వారంలో రెండు రోజులు ప్రజలకు అందుబాటు లో సిరిసిల్లలోనే ఉంటానని కేటీఆర్ హామీనిచ్చారని, గత ఆరు నెలలు గా కనీసం రెండు రోజులు కూడా సిరిసిల్లలో లేడని ఆరోపించారు. నియోజకవర్గం ప్రజలు నమ్మి ఓటు వేస్తే మల్లీ కేటీఆర్ కనిపించకుం డాపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు వారి బాగో గులపైన ఏ రోజు కూడా అధికారులతో రివ్యూ మీటింగ్‌ను కేటీఆర్ నిర్వహించలేదని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరల డబ్బులు బకాయిలు పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలను చెల్లించి అండగా నిలిచిందన్నారు. మున్సిపల్ ఎన్నికలలో తన ముఖం చూసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అడిగిన కేటీ ఆర్ ఆరు నెలల్లో ఒక్కరోజైనా వార్డులో తరగ లేదని, ప్రజల సమస్యల ను అడిగి తెలుసుకోలేదని విమర్శించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌ను ఇందిరమ్మ ఇల్లు కోసం కలిసిన వెంగళ వెంకటేశ్‌ను లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే మాన సికంగా కృంగిపోయిన వెంకటేశ్ మూడు రోజుల క్రితం అదృ శ్యమై అనుమానాస్పదంగా శనివారం శవమై కనిపించాడని ఆరోపించా రు. వెంకటేశ్ మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కేవలం హైదరాబాద్ రాజకీయాలకు పరిమి తమై సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గం ప్రజలను పట్టించుకోని కేటీఆర్ వెంటనే ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆకునూరి బాల రాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనితనళినీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాగుల జగన్, వేముల దామోదర్, మంగ కిరణ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ రియాజ్, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, మార్కెట్ కమిటి డైరెక్టర్ దుబాల వెంకటేశం, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నీలి రవీందర్, నాయకులు స్వర్గం రాజు, కోడం అరుణ, బైరి ప్రభాకర్, వంతడుపుల రాము, కంసాల మల్లేశం, ఇరుకుల్ల భాస్కర్, ఇప్పపుల్ల లక్ష్మణ్, దేవదాస్, మైసయ్య, శ్రీకాంత్, నర్సయ్య, అశోక్, శ్రీని వాస్, రవికుమార్ పాల్గొన్నారు.