Share News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, సీపీ సమీక్ష

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:30 AM

మండలంలోని గుమ్లాపూర్‌లో ఈ నెల 5న నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్‌ ఆలం సమీక్షించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, సీపీ సమీక్ష

చొప్పదండి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్లాపూర్‌లో ఈ నెల 5న నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్‌ ఆలం సమీక్షించారు. సోమవారం మండలంలోని గుమ్లాపూర్‌లో సభా ప్రాంగణం, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణ మ్యాప్‌ ఆధారంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడ్‌ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, భౌగోళిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్‌ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:30 AM