సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:29 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఐటి, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశం, బల్మూరు వెంకట్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే ఎమ్మె ల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లు స్థలాన్ని, హెలిప్యాడ్ ను మంగళ వారం రాత్రి పరిశీలించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఐటి, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశం, బల్మూరు వెంకట్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే ఎమ్మె ల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లు స్థలాన్ని, హెలిప్యాడ్ ను మంగళ వారం రాత్రి పరిశీలించారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిద్ధం చేసిన హెలిప్యాడ్, అంబేద్కర్ జంక్షన్, నేతన్న జంక్షన్ మీదుగా ముఖ్యమంత్రి కాలినడకన సభా ప్రాంగణానికి వచ్చే రహదారిని క్షేత్ర స్థాయిలో పరిశీ లించి, అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. రహదారి వెంబడి చెత్త, చెదారం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. బహిరంగ సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరి శీలించి, స్టేజీ, గ్యాలరీలు, శిలాఫలకాలు ఏర్పాటు చేసే స్థలం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పార్కింగ్ స్థలాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలె క్టర్ ఆదేశించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్.జగన్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఆర్‌బీ ఈఈ బీమ్లా నాయక్, డీఆర్డీవో లక్ష్మీ నారాయణ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన బుధవారం సిరిసిల్లలో ఇలా కొన సాగుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులు, కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం 4.30 గంటలకు బయలుదేరి 4.45 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి సాయంత్ర 6 గంటల వరకు పాదయాత్రగా రగుడు సమీపంలో ఏర్పాటు చేసిన సభా మైదానం వద్దకు చేరుకుంటారు. 6 గంటల నుంచి 6.15నిమిషాల వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 7.45 గంటల వరకు బహిరంగ సభ కొనసాగుతుంది. అనంతరం రోడ్డు మార్గంలో 9.45 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.