ధర్మపురి క్షేత్రంలో మంత్రి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:14 AM
ధర్మపురి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు మంగళ వాయిద్యాలు వెంటరాగా ఆలయం పక్షాన వేదపండితులు, అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
ధర్మపురి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు మంగళ వాయిద్యాలు వెంటరాగా ఆలయం పక్షాన వేదపండితులు, అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు మంత్రి యమధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనె పోసి భక్తి శ్రద్దలతో పూజించారు.. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను ఆలయ వేదపండితులు, అర్చకులు సముద్రాల వంశీకృష్ణ, నేరెళ్ల వంశీకృష్ణ ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆలయం పక్షాన మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు స్వామి శేష వస్త్ర, ప్రసాదాలు అందించి ఘనంగా స్మనించారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.