Share News

పల్లగుట్టలో మైనింగ్‌ తవ్వకాలు నిలిపివేయాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:02 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, గూ డురు మధ్య ఉన్న పల్లగుట్టలో మైనింగ్‌ తవ్వకాలను పర్యావరణ పరిరక్షణ కోసం నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామికి వినతిపత్రం ఇచ్చామని గురువారం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు.

పల్లగుట్టలో మైనింగ్‌ తవ్వకాలు నిలిపివేయాలి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, గూ డురు మధ్య ఉన్న పల్లగుట్టలో మైనింగ్‌ తవ్వకాలను పర్యావరణ పరిరక్షణ కోసం నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామికి వినతిపత్రం ఇచ్చామని గురువారం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, గూడురు మధ్య పల్లగుట్ట ఉందని దాని పరిధిలోని 60 ఎకరాలలో మైనింగ్‌ తవ్వకాలకు గతంలో ప్రభుత్వం రంగురాళ్ల తవ్వకాలకు అనుమతులు ఉన్నప్పటికి ఆ ప్రాంత ప్రజల ఒత్తిడికి పర్యావరణ పరిరక్షణలో భాగం గా ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేయబడిందని పేర్కొన్నారు. నాటి కాంట్రాక్టర్‌ తిరిగి ఇటీవల పల్లగుట్ట ప్రాంతంలోని 12 ఎకరాలలో రంగురాళ్ల కోసం మల్లీ తవ్వకాలు మొదలుపెట్టాడని దీంతో పల్ల గుట్ట కనుమరుగు అయ్యే ప్రమాద ఉందని వాపోయారు. గూడురు గ్రామానికి సహజంగా రక్షణగా ఉంటుందని ఈ గుట్టను తొలగిస్తే భూగర్భ జలాలు అడు గంటి తాగు సాగు నీటికి ప్రజలు ఇబ్బం దులు పడే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. గ్రానైట్‌ క్వారీ పేరుతో విధ్వంసం కాకుండా తవ్వకాలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డడం వివేక్‌వెంకటస్వామిని కలసి సీపీఐ పక్షాణ వినతిపత్రం అందించడం జరిగిందని తెలిపారు. మంత్రి వెంటనే స్పందించారని విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:03 AM