కలెక్టరేట్ ఎదుట మిల్లర్ల ధర్నా
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:53 AM
రైస్‌మిల్లింగ్ పరిశ్రమలు ఎదుర్కొం టున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్లు ఆందోళన చేపట్టారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లింగ్ పరిశ్రమలు ఎదుర్కొం టున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్లు ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లర్ల అసోసియే షన్ ఆధ్వర్యంలో మిల్లర్లు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలివచ్చారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. మిల్లర్లపై విజిలెన్స్ దాడులు, నమోదు చేస్తున్న కేసులపై మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్ల అసోసి యేషన్ అధ్యక్షుడు చేపూరి నాగరాజు, జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్య క్షుడు పబ్బ నాగరాజులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమ లను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2014 నుంచి 2025వరకు మిల్లర్లకు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త నిబంధనలు విధించడం సరైనది కాదని అన్నారు. మిల్లర్లపై విజిలెన్స్ దాడులు నిలిపివేయాలని ఉన్నారు. మిల్లులపై 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీ మాఫీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు గరిపెల్లి ప్రభాకర్, బుస్స శ్రీనివాస్, గౌరిశెట్టి భాస్కర్, నగునూరి శ్రీకాంత్, లింగాల మల్లయ్య, బండ సతీష్, వంశీధర్ రావు, గుండ రవి, ఎల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎల్లంకి అశోక్, చేపూరి చిన్న శ్రీనివాస్, అనంతల శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.