ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:36 AM
జిల్లా కేంద్రంలో బుధవా రం ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బుధవా రం ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను నిర్వహించారు. పత్తిపాక వీధిలోని జామే మసీద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థలను నిర్వహించి మసీద్ నుంచి జెండాలతో బైక్ ర్యాలీని నిర్వహించారు. మధ్యాహ్నం ప్రార్థల అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు జెండాలతో ర్యాలీ చేప ట్టారు. అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఖీర్ పంపిణీని ముఖ్య అతిథి ఎస్పీ మహే ష్ బి.గితే ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షుడు యూసుఫ్, ముస్తా ఫా, సత్తార్, నాయకులు రఫీయోద్దీన్, మునీర్, సోహెల్, అక్రమ్, మహ మూద్, షాదాబ్, అంజద్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.