Share News

మధ్యాహ్న భోజనం ప్రకటనలకే పరిమితం

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:01 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మారింది.

మధ్యాహ్న భోజనం  ప్రకటనలకే పరిమితం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారం భమై నెల రోజులు దాటినా పథకం అమలుకు సం బంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆకలితోనే తరగతులకు హాజరవుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు విస్తరిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనలు కార్య రూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ హామీలపై విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందించడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండటమే కాకుండా, ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇదే తరహాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే విద్యా సంవ త్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తయినా ఆ హామీ అమలుకు సంబంధించిన ఆదేశాలు వెలువడకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఫ 14 కళాశాలల్లో 4,400 మంది విద్యార్థులు

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, మం థనిలో బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలతో పాటు సుల్తానాబాద్‌, జూలపల్లి, ధర్మారం, కమాన్‌పూర్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ తదితర ప్రాం తాల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి సుమారు 4,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అధిక శాతం మంది పేద, బడుగు, మధ్యతరగతి కుటుం బాలకు చెందినవారే. గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు రోజూ తెల్లవారుజామునే బయలు దేరి బస్సుల్లో కళాశాలలకు చేరుకుంటున్నారు. ఉదయం ఇంట్లో తిన్న అల్పాహారమే సాయంత్రం వరకు వారికి ఆధారం అవుతోంది. మధ్యాహ్న భోజనం అందు బాటులో లేకపోవడంతో కొందరు నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంటే, మరికొందరు సమీపంలో ఉండే టీ స్టాళ్లలో టీ, స్నాక్స్‌ తీసుకుంటున్నారు. కొందరైతే ఆర్థిక ఇబ్బందులతో ఏమీ తినకుండా తరగతుల్లోనే గడుపుతున్నారు.

ఫ ఆకలితో తగ్గుతున్న ఏకాగ్రత

ఖాళీ కడుపుతో గంటల తరబడి తరగతుల్లో కూర్చోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోందని అధ్యాపకులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత అలసట, నీరసం కారణంగా పాఠాలపై దృష్టి సారించ లేకపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత కళాశాల నుంచి వెళ్లిపోతుండగా, మరికొందరు అసలు కళాశాలకు రావడానికే వెనుకాడుతున్నారు. దీని ప్రభావం హాజరు శాతంతో పాటు ఫలితాలపై కూడా పడుతోందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఉన్నత విద్యపై ప్రభావం

పదో తరగతి తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయా లనే లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరు తున్న విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలకు మధ్యాహ్న భోజనం లేకపోవడం చదువుపై ఆసక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ఒకవైపు చెబుతుండగా, మరోవైపు కళాశాలల్లో కనీస భోజన సౌకర్యం లేకపోవడం విరుద్ధ సంకేతాలను పంపుతోందని అభిప్రాయపడుతున్నారు.

ఫ పథకం అమలుపై అనుమానాలు

ప్రభుత్వం పలుమార్లు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రక టించినప్పటికీ, ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం, నిధుల కేటాయింపుపై స్పష్టత లేక పోవడంతో పథకం అమలవుతుందా లేదా అనే సందే హాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ప్రభుత్వ ప్రకటనలు కేవలం హామీలకే పరిమితమవు తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠ శాలల్లో విజయవంతంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కూడా వెంటనే అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:01 AM