Share News

మెప్మా పీడీ స్వరూపరాణికి స్వనిధి సమ్మాన్‌ జాతీయస్థాయి అవార్డు

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:37 AM

జాతీయ స్థాయి స్వనిధి సమ్మాన్‌ 2026 అవార్డుకు మెప్మా పీడీ జి స్వరూపరాణి ఎంపికయ్యారు.

మెప్మా పీడీ స్వరూపరాణికి స్వనిధి సమ్మాన్‌ జాతీయస్థాయి అవార్డు

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి స్వనిధి సమ్మాన్‌ 2026 అవార్డుకు మెప్మా పీడీ జి స్వరూపరాణి ఎంపికయ్యారు. ఢిల్లీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును శనివారం అందుకున్నారు. ఈ సందర్భంగా పీడీ స్వరూపరాణి మాట్లాడుతూ ఈ విజయం రాష్ట్ర మెప్మా విభాగం, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. ఈ స్ఫూర్తితో జిల్లాలో ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలును మరింత బలోపేతం చేస్తామని అన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:37 AM