Share News

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ABN , Publish Date - May 28 , 2026 | 01:04 AM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

వేములవాడ రూరల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేముల వాడ రూరల్‌ మండలం ఫాజుల్‌నగర్‌ గ్రామంలో బుధవారం ముదిరాజ్‌ సం ఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ద్వారా మంజూరు అయిన 46 లక్షలతో నిరి స్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దమ్మ గుడి నిర్మాణానికి అంకురార్పణ జరగడం శుభపరిణా మన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో సుమారు 9 దేవాలయ నిర్మాణా నికి నిధులు మంజూరు కావడం టెండర్లు, పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేశా రు. త్వరగా దేవాలయ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు, సంబంధించిన కాంట్రాక్టరుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశాలు జారీచేశారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండా లని ఆకాంక్షించారు.

Updated Date - May 28 , 2026 | 01:04 AM