ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:59 AM
ఆధ్యా త్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలు గుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ఆధ్యా త్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలు గుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి కల్యాణ మహో త్సవంలో ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నా యని అన్నారు. గృహ ప్రవేశ సమయంలో లబ్ధిదారులు మాట్లాడే మాటలు వింటే ఇంత కంటే ప్రజా సేవ ఏం ఉంటదని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఆలోచనలు పుణికిపుచ్చుకొని ముందుకు పోతున్నాం అన్నారు.. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదన్నారు.. మల్యాల గ్రామంలో సుమారు 60 పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మూడవ విడతగా మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగు తుందన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇస్తామని మోసం చేశారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తానని తెలిపారు. రైతులు అడగక ముందే సాగు నీరు విడుదల చేశామని తెలిపారు. మల్యాల గ్రామస్థులు కోరిన విధంగా బ్యాంకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పులి సత్త య్య, బొజ్జ మల్లేశం, మాజీ జ డ్పిటిసి సభ్యులు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.