Share News

కళలతో మానసిక ఆనందం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:25 AM

కళలు మానసిక ఆనందాన్నిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ అన్నారు. కరీంనగర్‌ సైన్స్‌ మ్యూజియంలో జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు శుక్రవారం నిర్వహించారు.

కళలతో మానసిక ఆనందం

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కళలు మానసిక ఆనందాన్నిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ అన్నారు. కరీంనగర్‌ సైన్స్‌ మ్యూజియంలో జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సైన్స్‌ డ్రామా ఆనందంతోపాటు శాస్త్ర సాంకేతిక ధృక్పథాన్ని పెంపొందింపజేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక రంగాల పై విద్యార్థుల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలకు మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. వివిధ యాజమాన్యాల కింద 31 సైన్స్‌ డ్రామాలు ప్రదర్శించారన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన మొదటి ఉత్తమ ప్రదర్శన రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీబీ కార్యదర్శి భగవంతయ్య, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ సర్‌ అశోక్‌రెడ్డి, బాలల సైన్స్‌ అకాడమిక్‌ కో ఆర్డినేటర్‌ పెద్ది బీరయ్య, రవినందన్‌రావు పాల్గొన్నారు. ప్రథమ బహుమతి అల్ఫోర్స్‌ హైస్కూల్‌ కొత్తపల్లి, ద్వితీయ బహుమతి సెయింట్‌ జార్జ్‌ హైస్కూల్‌ కొత్తపల్లి, మూడో బహుమతి భగవతి హైస్కూల్‌, కరీంనగర్‌ గెలుపొందినట్లు తెలిపారు.

Updated Date - Sep 12 , 2026 | 12:25 AM