మహిళా సంఘాల సభ్యులు అక్షరాస్యులు కావాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:44 AM
మహిళా సంఘాల సభ్యులందరు చదవడం, రాయడం నేర్చుకోవాలని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్
జగిత్యాల టౌన్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యులందరు చదవడం, రాయడం నేర్చుకోవాలని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు చదవడం, రాయడం నేర్చుకునేందుకు రూపొందించిన అమ్మకు అక్షర మాల అనే కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజగౌడ్ మాట్లాడుతూ ప్రతి మహిళ అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చదువు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, డిఎంసీ సునిత, టిఎంసీ రజిత, సివోలు రాధా, గంగారాని, శరణ్య, సీఆర్‌పీలు మాధవి, లత, స్రవంతి, జగిత్యాల పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగలక్ష్మి, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.