ప్రజాపాలనను ప్రతిబింబించేలా సభలు నిర్వహించాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం గ్రామ, వార్డు సభల నిర్వహణ, ఇందిరమ్మ జీవితా బీమా పథకాలపై ప్రజాపాలన- ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈసందర్భంగా డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకేరీతిన ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు వివరిం చడంలో ఎటువంటి లోపాలు ఉండవద్దన్నారు. గ్రామ సభలకు వార్డు మెంబర్ నుంచి ఎంపీ మంత్రి వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. గ్రా మసభ ముఖ్యమంత్రి సందేశంతో ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామంలో చది వి వినిపించాలని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల లబ్ధిదారుల వారు పొందుతున్న లబ్ధి గురించి మాట్లాడించాలని ఆదేశించారు. జూన్ 2 నుంచి ప్రారంభించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్య క్రమంతోపాటు పాలు లేదా రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక శాఖ ద్వారా అందుబాటులో ఉన్న కళాకారులను ఉప యోగిస్తూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిం చేందుకు యాక్షన్‌ప్లాన్ తయారుచేయాలని ఆదేశించారు. గ్రామాలకు ప్రభుత్వం భారీ ఎత్తున విడుదల చేసిన నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో పకడ్బందీగా అమలు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచా యతీలు, మున్సిపాలిటీల్లో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అన్ని చోట్లా పకడ్బందీ ప్రణాళిక అమలు చేయాలని సూచిం చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయా లని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, లబ్ధిదారులు హాజరు అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదే శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు చేరవేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో గీత, సీపీవో శ్రీని వాసాచారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికా రి వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, ఉద్యానవన శాఖ అధి కారి శరత్‌బాబు, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.