Share News

గ్రామాల్లో సమర్థవంతంగా వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:41 PM

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందాలని, అందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి ఏంజె ల ఆల్ఫెండ్‌ అన్నారు.

గ్రామాల్లో సమర్థవంతంగా వైద్య సేవలందించాలి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందాలని, అందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి ఏంజె ల ఆల్ఫెండ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు నాణ్యమైన సమయానుకూలమైన వైద్య సేవలు అందేలా చర్యలు తేసుకోవాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, ప్రసూతి సేవలు, టీకాల కార్యక్ర మాలు, పోషకాహార పర్యవేక్షణ వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతతో అమ లుచేయాలని సూచించారు. అలాగే క్షయవాధి నియంత్రణ కార్యక్రమాలు అమ లుపై పలు సూచనలు చేశారు. క్షయ రోగులను తప్పనిసరగా పరీక్షలు నిర్వ హించాలని నిర్ధారణ అయిన ప్రతి రోగిని నిక్షయ్‌ పోర్టల్‌లో నమోదు చేయా లన్నారు. క్షయ రోగులకు చికిత్స పూర్యయ్యే వరకు నిక్షయ్‌ మిత్రుల సహకారాన్ని ప్రోత్సహిస్తూ పోషకాహారం సామాజిక మద్దతు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, పరీక్ష సామగ్రి ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఐపీహెచ్‌ఎస్‌ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న లోపాలను గుర్తించి గ్యాప్‌ అనాలిసిస్‌ నిర్వహించాలన్నారు. వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా, వైరల్‌ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచిం చారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు విస్తృత ప్రచార కార్య క్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, సంక్షేమ కార్య క్రమాలను చేరే విధంగా సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ యల్‌ నాగేందర్‌బాబు, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డీఐవో రామకృష్ణ, పీవోఎన్‌సీడీ వేణుగోపాల్‌రెడ్డి, పీవో టీబీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:41 PM