మల్లన్నపల్లిలో వైద్య శిబిరం
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:53 PM
మండలంలోని మల్లన్నపల్లిలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.
ఇల్లందకుంట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లన్నపల్లిలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేశారు. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించి అవసరమైన వారికి వైద్యం అందించారు. అనంతరం వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసునూటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ కనుకుల తిరుపతిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.