మేడారం ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:52 PM
తెలంగాణతో పాటు ఇతర రాష్టాల నుండి మేడారం జాతరకు వచ్చే ప్రయాణికులకు ఆయా డిపోల పరిధిలో సౌక ర్యాలను కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్(ఆర్‌ఎం)బీ రాజు అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణతో పాటు ఇతర రాష్టాల నుండి మేడారం జాతరకు వచ్చే ప్రయాణికులకు ఆయా డిపోల పరిధిలో సౌక ర్యాలను కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్(ఆర్‌ఎం)బీ రాజు అన్నారు. మంగ ళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఆవరణలో మేడారం జాత రను విజయవంతం చేయడం కోసం కార్మికులు, సిబ్బందితో జరిగిన సమావేశం లో రీజినల్ మేనేజర్ మాట్లాడారు. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్లే ప్రయాణికులను భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. జాతరకు సంబంధించిన నిబంధనాలను ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాటించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కావలసిన సౌకర్యాలను సమకూర్చుతున్నామన్నారు. జాతర సందర్భంగా ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా నిబద్ధతతో విధులను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ డిప్యూటీరీజనల్ మేనేజర్ భూపతిరెడ్డి, సిరిసి ల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ ప్రకాష్‌రావు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.