రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:44 PM
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల రహిత రహదారిగా మార్చడానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు.
తిమ్మాపూర్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల రహిత రహదారిగా మార్చడానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం రహదారులపై బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తీసుకోవలసిన చర్యలపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా డీటీసీ మాట్లాడుతూ అలుగునూరు చౌరస్తా నుంచి రేణికుంట టోల్ ప్లాజా వరకు గుర్తించబడిన 19 బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. గతంలో గుర్తించిబడిన బ్లాక్ స్పాట్లను వాటిలో ఇంకా మిగిలివున్న లోపాలను గుర్తించి రహదారిని బ్లాక్ స్పాట్ల రహిత రహదారిగా మార్చడానికి అవసరమైన చర్యలతో కూడిన సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తనిఖీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహాచారి, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, డీఈ రాజశేఖర్, ఏడబ్ల్యూఈ స్రవంతి, స్టేట్ హైవే అథారిటీ డీజీఎం విజయభాస్కర్, ఉమ్మడి తనిఖీ బృందం రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ నీలం సంపత్, హెడ్ కానిస్టేబుల్ భాస్కరాచారి రోడ్డు భవనాలశాఖ సిబ్బంది, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.