ధాన్యం రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు
ABN , Publish Date - May 22 , 2026 | 12:05 AM
వరి, మక్కలు, యూరియా రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసకుంటున్నట్లు డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు.
-డీసీపీ భూక్యా రాంరెడ్డి
పెద్దపల్లి టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి): వరి, మక్కలు, యూరియా రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసకుంటున్నట్లు డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు. గురువారం పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో యూరియా సరఫరా, ధాన్యం రవాణాపై సమీక్ష నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లో యూరియా బస్తాల అన్‌లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులు, హమాలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. .ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా కోసం అధిక సంఖ్యలో లారీలను వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న యూరియా ఎరువుల రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. వరి, మొక్కజొన్న రవాణా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడంతోపాటు రైతులకు అవసరమైన యూరియా సరఫరా నిలిచిపోకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. . యూరియా బస్తాల సరఫరా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. రైల్వే వ్యాగన్ల నుంచి యూరియా బస్తాలను లారీలలోకి ఎక్కిస్తున్న హమాలీల దాహార్తిని తీర్చేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాంభించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్, అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు.