Share News

అర్హులెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:04 AM

అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పక డ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిష నర్‌ బాలమాయాదేవి ఆదేశించారు.

అర్హులెవరూ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పక డ్బందీగా పూర్తి చేయాలని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిష నర్‌ బాలమాయాదేవి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై జిల్లాలోని ఈఆర్‌వోలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిష నర్‌ బాలమాయాదేవి సమీక్షించారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో ఓటరు జాబి తాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలపై సమావేశాలను నిర్వహించే విఽధానంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఫారం 6,7,8 కింద మొత్తం 88638 దరఖాస్తులు రాగా 87853లను పరిష్క రించామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షే మ శాఖ కమిషనర్‌ బాలమాయాదేవి మాట్లా డుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మని స్పష్టం చేశారు. ఓటు హక్కు దుర్విని యోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పో కుండా చూడటం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను అభినందించారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడు వులోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన ఓట్లకు సంబం ధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. వాటికి సంబంధించిన అన్ని పత్రాలు భద్రపర్చాలని సూచించారు. భవిష్యత్తులో ఏ సమస్యలు తలె త్తకుండా రికార్డులు పక్కాగా నిర్వహించాల న్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిం చాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిం చారు. అధికారులంతా మ రింత బాధ్యతతో పనిచేసి జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ను పూర్తి చేయాలని ఆదే శించారు. ఏఎస్‌డీడీ జాబి తా మరోసారి పరిశీలించా లని ఆమె ఆదేశించారు.

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా..

భారత ఎన్నికల సం ఘం ఆదేశాలకు అనుగు ణంగా ముందుకు వెళ్తామని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తా మని స్పష్టం చేశారు. అర్హుల ఓటు హక్కు కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గడువులోగా ప్రక్రియ పూర్తిచేస్తా మని తెలిపారు. ఈ సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లోని పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 1105లో రికార్డులు పరిశీలించారు. ఫారం-6, 7 ఇతర దరఖాస్తులపై ఆరాతీశారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదును పరిశీలించా రు. హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది, రిజిస్టర్‌లో ఫిర్యా దుల నమోదు, పరిష్కారాలపై అడిగి తెలుసు కున్నారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కేఎస్‌బీ కుమారి, ఏఈ ఆర్‌ఓలు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ఉమారాణి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:04 AM