సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:27 AM
నియో జకవర్గ పరిధిలోని రైతులకు సాగునీటికి ఎలాం టి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటు న్నామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : నియో జకవర్గ పరిధిలోని రైతులకు సాగునీటికి ఎలాం టి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటు న్నామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజక వర్గ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామన్నపేటలో డి 4 కాలువ, చందుర్తి ప్రాజె క్ట్, మల్యాల పంపు హౌస్‌ను శనివానం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుకున్నారు. ఆనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గనికి నీరు విడుదల అయ్యాయన్నారు. వేసవిలో రైతులకు సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. రామన్నపేట గ్రామంలో గతంలో తెగిపోయిన కాలువను అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. రామన్నపేట గ్రామంలో చందుర్తి ప్రాజెక్టు నుంచి వచ్చే డి4 కుడి కాలువ పరిశీలించి మరమ్మతులకు 21 లక్షల నిధులు మంజూరు చేసామన్నారు. రెండు రోజుల్లో కాలువ మరమ్మ తుల పనులు ప్రారంభం చేస్తామన్నారు. కాలు వ మరమ్మతు చేయడం వల్ల చందుర్తి మండ లంలోని తిమ్మాపూర్ రామన్నపేట ఆశిరెడ్డిపల్లి గ్రామాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కాలువ ద్వారా నీటిని అశిరెడ్డిపల్లి గ్రామంలోని కొచ్చేరువు వరకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గతంలో కొచ్చేరువుకు గండిపడే సందర్భంలో 43 లక్షలతో మరమ్మ తులు చేపించడం జరిగిందన్నారు. చందుర్తి మండల పరిధిలో కొచ్చేరువు, ఎర్ర చెరువు పటేల్ చెరువులో, బండపల్లి, ఎనగల్, జోగా పూర్ చెరువులలో నీరు ఉంటే చందుర్తి మండలంలో సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. చందుర్తి మండలంలో 450 ట్యాంకు మల్యా లలో పంప్ హౌస్ పరిశీలించడం జరిగిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు ఒక మోటార్ మరమ్మతులు చేయడం వల్ల నీరు కొంత ఆలస్యంగా వచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ అండగా ఉంటుందన్నారు. రైతును రాజుగా చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పులి సత్తయ్య, బోజ్జ మల్లేశం, నాయకులు చింతపంటి రామస్వామి, భీమారాజు కనకరాజు, మల్లారపు రాజయ్య, దొంగరి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.