Share News

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:21 AM

వేసవి వడగాలుల నష్టాల నియం త్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు దాహార్తి తీర్చేందు కు చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : వేసవి వడగాలుల నష్టాల నియం త్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు దాహార్తి తీర్చేందు కు చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం వేసవి వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జగ్రత్తల పై వైద్యఆరోగ్య, అగ్నిమాపక, అటవీ, కార్మిక, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో అధికారులో సమీక్షించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌లను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డుతూ వేసవికాలంలో వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజ లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశా కార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అం దుబాటులో ఉండాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాల ని సూచించారు. ఏమైనా మరమ్మతు ఉంటే ముందస్తుగానే చేయించాలని ఆదే శించారు. మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, బస్టాండ్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదే శించారు. వేసవి కాలంలో ప్రతి రోజు నీరు తాగడం,గొడుగు తీసుకుని బయటికి రావడం, వేడి గాలులు వచ్చే సమయంలో ఇంట్లోనే ఉండటం వంటి వివిధ అం శాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఉపాధిహామీ పనులు, ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మూగ జీవాల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాల్లో నీటి తొట్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలపై పశు వైద్య, సంవర్ధక శాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వాటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, వైద్యాధికారి డాక్టర్‌ రజిత, వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, డీఆర్డీవో గీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:21 AM