నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:10 AM
వర్షాకాలం నేపథ్యంలో గ్రామా ల్లో ఎక్కడా నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు.
వేములవాడ రూరల్, జూన్ 30(ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం నేపథ్యంలో గ్రామా ల్లో ఎక్కడా నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిఽధిలోని మర్రిపల్లి గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామాల్లో దోమలు పెరగకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రపర చాలని సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సందర్శించారు. మూడవ రోజు పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం, సోమవారం పల్స్‌పోలి యో చుక్కలు వేసుకోని వారిని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు డోర్ టూ డోర్ వెళ్లి పరిశీలించి గుర్తించాలన్నారు. అందరికి పల్స్‌పోలియో చుక్కలు వేసే విధంగా చూడాలని ఆదేశించారు. మంగళవారం గ్రామంలో జరుగుతున్న డోర్‌టూడోర్ కార్యక్రమాన్ని పరిశలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ వైద్యాధికా రి సంపత్‌కుమార్, వీసీసీఎం నవీన తదితరులు పాల్గొన్నారు.