చెరువులు, రిజర్వాయర్ల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:36 AM
జిల్లాలో గుర్తించిన చెరువులు, రిజ ర్వాయర్‌ల సంరక్షణ, అభివృద్ధికి సం బంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో గుర్తించిన చెరువులు, రిజ ర్వాయర్‌ల సంరక్షణ, అభివృద్ధికి సం బంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం చెరువులు, రిజ ర్వాయర్‌ల సంరక్షణ, అభివృద్ధిపై అటవీ, రెవెన్యూ, నీటిపారుదల,మత్స్య, వ్యవసాయ, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారు లతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, రిజర్వాయన్‌లు నీరు నిల్వ ఉండే భూములు ప్రకృతి సమతుల్యతకు కీల కమని, ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. జిల్లాలో మొ త్తం 164 చెరువులు గుర్తించామని వెల్లడించారు. ఆయా చెరువులకు హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌ను రెవె న్యూ, సర్వేఅండ్‌ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ, నీటి పారు దల ఇతర శాఖల సమన్వయంతో సర్వే, మ్యాపింగ్, ఆన్ లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి అభివృద్ధి కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలు పం పించాలని ఆదేశించారు. ఆయా జల వనరుల అభివృద్ధి, మరమ్మత్తు పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తార ని పేర్కొన్నారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో చెరువులు కబ్జా నుంచి రక్షించవచ్చని స్పష్టం చేశారు. మొక్కల, చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
భూముల రీ సర్వేలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో ఆయా శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా సర్వే కొనసాగుతుందని తెలిపారు. అటవీ శాఖ, నీటిపారుదల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన భూముల వివరాలు సర్వే అధికారులకు ఇవ్వాలని, సర్వేలో పాల్గొనాలని ఆదే శించారు. ఈసమావేశంలో సిరిసిల్ల ఆర్డీవోశ్రీధర్ బాబు, వేములవాడ అర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనా రాయణ, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటిపారు దల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తి
సీఎంఆర్ డెలివరీ నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గురు వారం రాత్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ వేగవంతం చేసి సూచించిన గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వచ్చే సీజన్‌కు సంబంధించి చేయా ల్సిన ఏర్పాట్లపై చర్చించి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.