విద్య, వైద్యం అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - May 02 , 2026 | 12:36 AM
విద్య, వైద్యం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): విద్య, వైద్యం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా అవగహన కార్యక్రమా న్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రభుత్వ విప్ ప్రారంభించారు. డీఈఐసీ కేంద్రంలో 85మంది పిల్లలకు చికిత్స అందిం చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స అందిస్తుంగా పరిశీ లించి వారి వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. మున్సిపల్ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమా లు, చెత్తచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యా లయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పోలీస్ శాఖ, రవా ణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ కింద రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారని గుర్తుచేశారు. 5 సంవత్స రాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఎదుగుద ల లోపాలుగల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ది మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబం ధించిన సమస్యలు, సరిగా మాట్లాడలేని పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలోని లోపాన్ని గుర్తిసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, స్థానిక కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీ రాజం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు ఉన్నారు.