అటవీ భూముల సంరక్షణకు చర్యలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:20 AM
అటవీ భూము లను అటవీ శాక అధికారులు సంరక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అటవీ భూము లను అటవీ శాక అధికారులు సంరక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేష్ బీ గితే, జిల్లా అటవీ శాఖ అధికారి సత్య నారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్ట ర్ గరిమ అగ్రవాల్ అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణ, చెరువులు (వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, అభివృద్ధి, సిట్ నియామకం తదితర అంశాలపై అటవీశాఖ, పోలీ స్, రెవెన్యూ, నీటి పారుదల, మత్స్య, వ్యవసాయ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నియామకం, అటవీ భూముల ఆక్రమణలపై చర్యలు, అటవీ భూములకు సంబంధించిన సమస్యలు, ఆక్రమణలు, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల రికార్డుల పరిశీల న, భూముల సరిహద్దుల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ అటవీ భూములకు సంబంధించిన రికా ర్డులు, పట్టా భూములు, ప్రభుత్వ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించాలని, ఫారె స్,్ట రెవెన్యూ భూముల విషయంలో ప్రత్యేక దృష్టి సారిం చాలని, రెవెన్యూ,ఫారెస్ట్ శాఖల అధికారులు సంయుక్తం గా భూముల సరిహద్దులను పరిశీలించడం, జాయింట్ సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని అటవీ శాఖ భూములు, వన్యప్రాణులను అటవీ శాఖ అధికారు లు సంరక్షించాలని సూచించారు. భూములు ఆక్రమించే వారిపై, జంతువులను వేటాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ భూములను కబ్జా నుంచి కాపాడాలని, రెవెన్యూ, సర్వేఅండ్‌ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించా రు. అటవీ భూముల్లో మొక్కలు నాటాలని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు దోహదం
చెరువులు(వెట్‌ల్యాండ్స్) నీరు నిల్వ ఉండే భూము లు ప్రకృతి సమతుల్యతలో కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా వనరులు భూగర్భ జలాల పెరుగుదల కు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. జిల్లాలో మొత్తంగా 157వెట్ ల్యాండ్స్ గుర్తిం చామని వెల్లడించారు. ఆయా వెట్ ల్యాండ్స్ హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌ను రెవెన్యూ, సర్వేఅండ్‌ల్యాండ్ రికార్డ్స్ అటవీ శాఖ, నీటి పారుదల ఇతర శాఖల సమ న్వయంతో సర్వే, మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ వివ రాలు ఆన్‌లైన్ నమోదు చేయాలని సూ చించారు. వాటి అభివృద్ధి కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. దీంతో వలస, స్థానిక పక్షు లు, జంతువులకు ఉపయోగపడుతుంద ని తెలిపారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొ న్నారు. భవిష్యత్తులో చెరువులు కబ్జా నుంచి రక్షించవచ్చని స్పష్టం చేశారు. మొక్కల, చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ముందస్తు సమాచారం ఇవ్వాలి
అటవీ శాఖ భూముల్లో మొక్కలు నాటడం ఇతర కార్యక్రమాల నిర్వహణపై తమకు ముందస్తుగా సమా చారం ఇవ్వాలని ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు. అట వీ భూముల ఆక్రమణ ఇతర అంశాలపై అటవీ శాఖతో కలిసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధి కారి జయశ్రీ, ఆర్డీవో కేఎస్ బీ కుమారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఎఫ్‌ఆర్‌వోలు నాగేశ్వర్‌రావు, శీతల్, మున్సిపల్ కమిషనర్లు లోకేష్, ఖదీర్ పాషా ఆయా శాఖల అధికా రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.