ఆర్వోబీ పనుల్లో జాప్యంపై మేయర్ ఆగ్రహం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:54 PM
కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి ప్రదాన రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యంపై మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి ప్రదాన రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యంపై మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో కలిసి రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను బుధవారం పరిశీలించారు. నత్తనడకన పనులు కొనసాగుతుండటంతో అసహనం వ్యక్తం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతల రోడ్డు, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతుకుండా చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణ సమస్యను అధికారులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. నిర్మాణ ప్రాంతంలో ప్రతి రోజు నీళ్లు పడుతూ దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైల్వే ఏడీ ఈఎస్ భిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్, నాయకులు సాదినేని మునీందర్ పాల్గొన్నారు.