Share News

మేడే బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:50 AM

ఏఐఎఫ్‌టీయూ(న్యూ) ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మేడే బహిరంగ సభను విజ యవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడే బహరంగ సభ అధ్యక్షుడు సోమిశెట్టి దశరథం అన్నారు.

మేడే బహిరంగ సభను విజయవంతం చేయాలి

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ఏఐఎఫ్‌టీయూ(న్యూ) ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మేడే బహిరంగ సభను విజ యవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడే బహరంగ సభ అధ్యక్షుడు సోమిశెట్టి దశరథం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మేడే కరపత్రాన్ని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మేడే రోజు గ్రామగ్రామాన జెండాలను ఎగురవేయాలన్నారు. మే 1న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం నుంచి శాంతి నగర్‌ చౌరస్తాలోని జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జెండాను ఎగరవేసి బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ర్యాలీ, బహిరంగ సభలో జిల్లాలోని కార్మికులు, విద్యార్థులు, పార్టీ నాయ కులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కిషోర్‌, రవీందర్‌, సతీష్‌, దేవదాస్‌, రవి, సత్తయ్య, రాంప్రసాద్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:50 AM