జనగణన-2027లో మాస్టర్ ట్రైనర్‌లే కీలకం
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:18 AM
రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్‌లు కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్‌లు కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో జరుగుతున్న జనగణన మాస్టర్ ట్రైనర్‌లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమఅగ్రవాల్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణనని వెల్లడించారు. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ 2027 ఫిబ్రవరి లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. జనగణన సేకరించే వివరాలు కీలకమని స్పష్టం చేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, ఇతర అన్ని అంశాలపై డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ మాస్టర్ టైన్రర్ శివ రామ కృష్ణ పూర్తి స్థాయిలో వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి అంశంపై అవగహన కల్పించారు. ఈ శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్ కుమార్, మాస్టర్ టైన్రర్లు తదితరులు పాల్గొన్నారు.