శ్రీరామ నవమి ఉత్సవాలకు భారీ బందోబస్తు
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:23 AM
శ్రీరామనవమి ఉత్సవాల కు భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : శ్రీరామనవమి ఉత్సవాల కు భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం శ్రీరామనవిమి సంద ర్భంగా చేపట్టాల్సిన భద్రతపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడలో శుక్ర వారం జరిగే సీతారాముల కల్యాణోత్సవంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు 300 మంది పోలీస్ పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నామన్నా రు. సీతారాముల కల్యాణం సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను భాద్య తగా నిర్వహించాలని, ఇన్‌చార్జీ అధికారులు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవాంఛాయనీ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్య లు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే శనివారం సిరిసి ల్ల జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ మోగా లోక్ అదాలత్ సందర్భంగా విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందితో సమన్వయం చేసు కుంటూ రాజీపడదగిన కేసులను గుర్తించాలని సూచించారు. కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించు కునేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారీ, శ్రీనివాసు లు, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, మొగిలి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.