Share News

రైతు సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌ కమిటీ కృషి

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:45 AM

రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌కమిటీ పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.

రైతు సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌ కమిటీ కృషి

ఇల్లంతకుంట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్‌కమిటీ పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో మంగళవారం ఏ ఎమ్‌సీ చైర్‌పర్సన్‌ అంతగిరి సాహిత్యవినయ్‌కుమార్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ద్వారా అందించే సేవలతో రైతులు సంతోషంగా ఉండాలి తప్ప బాధతో కన్నీరు పెట్టే పరిస్థి తి కల్పించవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని, అందుకు అనుగుణంగా పాలకవర్గం పనిచేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల సంక్షేమానికి పాటు పడే పార్టీ అని, అందుకే రైతులు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, రైతుల రుణమాఫీ చేసిందని, తూకాల పేరుతో రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల బాధ్యత మహిళలకు అప్పగించిందన్నారు. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌ ద్వారా వచ్చే నీటిని పైప్‌లైన్‌ ద్వారా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద నిర్మించిన చెరువుకు మళ్లిం చారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏఎమ్‌సీ చైర్‌పర్సన్‌ అంతగిరి సాహిత్యవినయ్‌కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమ ణారెడ్డి, మాజీ ఫ్యాక్స్‌చైర్మన్‌లు మహేందర్‌రెడ్డి, రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు భరత్‌రెడ్డి, డైరెక్టర్లు మల్లయ్య, బడుగులింగం, వాడె శ్రీనివాస్‌రెడ్డి, జెట్టి మల్లేశం, మంద బాల్‌రెడ్డి, వెలిచాల జ్యోతి, బంగారి అంజయ్య, ఎరుకల తిరుపతి, జుట్టు నగేష్‌, మాతిరెడ్డి నవీన్‌రెడ్డి, ఉప్పల వేణు, గుండ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాజేందర్‌రెడ్డి, ఆనందరెడ్డి, ప్రసాద్‌, కేశవరెడ్డి, ఒగ్గు రమేష్‌, బాలపోచ య్యలతో పాటు పలుగ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

రైతులు నష్టపోవద్దనే కొనుగోలు కేంద్రాలు

రైతులు దళారీల బారినప డి నష్టపోవద్దనే గ్రామగ్రా మాన ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మానకొండూర్‌ ఎమ్మెల్యే డా క్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయ ణ పేర్కొన్నారు. మండలంలో ని వెల్జీపూర్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. సన్నరకపు వడ్లను కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం ద్వారానే రైతుల కు బోనస్‌ వస్తుందన్నారు.ఎమ్మెల్యేను సర్పంచ్‌ సన్మానిం చారు. కార్యక్రమంలో ఫ్యాక్‌సచైర్మన్‌ వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌, ప్యాక్స్‌ డైరెక్టర్‌ గుండ వెంకటేశం, ఏపీఎం కుమారస్వామి, నాయకులు బొజ్జ శ్రీనివాస్‌, సంగెం ముత్తవ్వ, వెలిచాల భారతిశ్రీనివాస్‌, వేములవాడ భారతిరాజేశం, మూల బాల్‌రెడ్డి, ఓరెం రూప, కరుణ, ఎల్లయ్య, బొల్లారం పర్శరాం, రమణాచా రి, గుండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:45 AM