ప్రణాళిక ప్రకారం నక్ష సర్వే
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:11 AM
నక్ష సర్వే ప్రణాళిక ప్రకా రం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : నక్ష సర్వే ప్రణాళిక ప్రకా రం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి నక్ష సర్వే పురోగతితో పాటు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నక్ష కింద దేశంలోని 150 అర్బన్ లోకల్ బాడీస్‌ను ఎంపిక చేశారని, రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలు ఎం పిక చేశారని తెలిపారు. జూలై నెలాఖారులోగా మొత్తం సర్వే ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పకడ్బందీగా పూర్తి చేయిస్తాం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష కార్యక్రమం కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307బ్లాక్స్‌లు ఉన్నాయని, ఇప్పటి వరకు 49 పూర్తిచేశామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. 14వేల 984 ఇళ్లు ఉండగా, 6707 ఇళ్ల సర్వే పూర్తి అయిం దని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా పూర్తి చేయిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వేయర్ శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, టీపీవో అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
దివ్యాంగుల సమస్యలపై అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఐదుగురు దివ్యాంగుల ఇబ్బందులను చూసి చలించిన కలెక్టర్ సత్వరం స్పందించి వారికి ట్రైసైకిల్, వీల్‌చైర్‌లను అందజేశారు. తమ సమస్య ఇబ్బందులను గుర్తించి మానవతా ధృక్పథంతో బ్యాటరీ సైకిళ్లను అందజేసి కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా సంక్షే మాధికారి లక్ష్మీరాజం తదిత రులు పాల్గొన్నారు.