Share News

ప్రధానిపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు శోచనీయం

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:42 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు.

ప్రధానిపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు శోచనీయం

గణేశ్‌నగర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగరన్‌ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఇది కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్‌రెడ్డి, గుజ్జ శ్రీనివాసరావు, కనుమల్ల గణపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్‌రావు, నరసింహరాజు, దురిశెట్టి సంపత్‌, గాజుల సప్న పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:42 AM