28న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:53 PM
ఏఐఎఫ్‌టీయూ(న్యూ), తెలంగాణ రైతు కూలీ సంఘం(ఏఐకేఎంకేఎస్) సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న కార్మికులు, రైతు కూలీలు, వ్యవసాయదారులు, పీడిత జనాల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఏఐఎఫ్‌టీయూ(న్యూ), తెలంగాణ రైతు కూలీ సంఘం(ఏఐకేఎంకేఎస్) సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న కార్మికులు, రైతు కూలీలు, వ్యవసాయదారులు, పీడిత జనాల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక, రైతు కూలీలు, వ్యవసాయదారుల భవిష్యత్తు పోరాటాలపై రాష్ట్ర సదస్సులో పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక ఉద్యమాలను అణగదొక్కుతూ కార్మి క చట్టాలను నిర్వీరం చేస్తూ పెట్టుబడుదారులు, విదేశీ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని అన్నా రు. అధికారం కోసం రాష్ట్రంలోని పార్టీలు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఓట్లు వేసిన ప్రజలనే అణ గదొక్కుతున్నాయని ఆరోపించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు అయినా ఏ వర్గానికి చెందిన ప్రజ లు సంతృప్తిగా లేరన్నారు. రాష్ట్రంలో కార్మిక, కర్షకులను తాము ఏకం చేస్తూ పోరాటాలు చేస్తున్నామని, భవిష్యత్తు కార్యచరణ కోసం రాష్ట్ర సదస్సును నిర్వ హిస్తున్నామన్నారు. జిల్లా నుంచి కార్మికులు, మేధవులు పెద్ద సంఖ్యలో పాల్గొనా లని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఒల్లాల కిషోర్, భామండ్ల రవీందర్, మచ్చ అనసూర్య, సలేంద్ర ఎల్లయ్య, ముత్తంగి వసంత, మాసం అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.