గౌరపూర్ణిమ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:53 AM
గౌరపూర్ణిమ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సిరిసిల్ల ఇస్కాన్ ఇన్‌చార్జి ప్రాణనాథ్ అచ్యుత దాస ప్రభుజీ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : గౌరపూర్ణిమ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సిరిసిల్ల ఇస్కాన్ ఇన్‌చార్జి ప్రాణనాథ్ అచ్యుత దాస ప్రభుజీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం రోజు నేరెళ్ళలోని ఇస్కాన్ నూతన మందిరంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవ దినో త్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా హరినామ సంకీర్తన, గౌర నితాయ్, కృష్ణ బలరామ మహా అభిషేకం, గౌరకథ ప్రవచనాలు ఉంటా యన్నారు. పవిత్ర గౌరపూర్ణమ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిరిసిల్ల పట్టణం నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యంను ఏర్పాటు చేస్తున్నామని భక్తులు ఈ అవ కాశంను సద్వినియోగయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇస్కాన్ నిర్వాహకులు రాకల గోపీశ్వరదాస ప్రభుజీ, భక్త సాగరప్రభు, వీరేందర్ ప్రభు, సాయికృష్ణప్రభు, ప్రణీత్‌ప్రభు, తిరుపతిప్రభు పాల్గొన్నారు.