Share News

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:50 PM

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చా రు.

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

బోయినపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చా రు. ప్రపంచ టీబీ నివా రణ దినోత్సవాన్ని బోయి నపల్లి మండలం కొదు రుపాక ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో మంగళ వారం నిర్వహించగా, కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌,అధికారులు పంపిణీ చేశారు. అలాగే టీబీ రహిత గ్రామాలుగా ప్రక టించిన 20 గ్రామాల కార్యదర్శులు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొబైల్‌ ఎక్స్‌రే యంత్రం ద్వారా జిల్లాలోని 42 గ్రామాల్లో మొత్తం 100 రోజుల్లో చేయను న్న వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రోగ్రామ్‌ను కలెక్టర్‌ ప్రారం భించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు మార్చి6 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు అన్ని శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేప డుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సేవలు అందిస్తున్నామని వివ రించారు. రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాలో టీబీ నిర్ధా రణ ఆరోగ్య పరీక్షలు మొబైల్‌ వాహనం, ఎక్స్‌రే యంత్రం ద్వారా ప్రణాళిక ప్రకారం చేస్తారని, మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా, ఇతర ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించాలని సూచించారు. టీబీ బాధితులకు ప్రతినెలా వెయ్యి రూపా యల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నదని వెల్ల డించారు. పేషెంట్లు కచ్చితంగా మందులు వాడుతూ.. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తం గా 360 మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, వైద్యులు శంకర్‌, సత్యనారాయణ, ఆనంద్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ రేణు ప్రియాంక, రాజు కుమార్‌, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, సర్పంచ్‌ కే. మం జుల, ఎంపీవో శ్రీధర్‌, టీబీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:50 PM