Share News

దీక్షా దివస్‌ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:39 AM

కరీంగనర్‌ జిల్లా అల్గునూరులో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు.

దీక్షా దివస్‌ సభను విజయవంతం చేయాలి

వేములవాడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కరీంగనర్‌ జిల్లా అల్గునూరులో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. వేముల వాడ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు తో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్‌, లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ఈనెల 29వ తేదిన జరిగే సభకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక బాపు రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌ రెడ్డి, నాయకులు నాల్యకొండ అరుణ, గొస్కుల రవి, మల్యాల దేవయ్య, సెస్‌ డైరేక్టర్‌ రేగులపాటి హరిచరణ్‌ రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, నీలం శేఖర్‌, నిమ్మశెట్టి విజయ్‌, వాసాల శ్రీనివాస్‌, వంగల శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:39 AM