దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:03 AM
అల్గునూర్‌లో ఈ నెల 29న నిర్వహించతలపెట్టిన బీఆర్‌ఎస్ దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు పార్టీశ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అల్గునూర్‌లో ఈ నెల 29న నిర్వహించతలపెట్టిన బీఆర్‌ఎస్ దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు పార్టీశ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. శుక్రవారం దీక్షా దివస్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక మిషన్ హాస్పిటల్ కంపౌండ్ వాల్‌కు వాల్‌రైటింగ్ చేసి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీక్షా దివస్ - మలుపుతిప్నిన కేసీఆర్ ఆమరణ దీక్ష అనే ప్రచార నినాదాన్ని ఆయనే స్వయంగా గోడపై రాశారు. కరీంనగర్‌లోని అల్గునూర్‌లో నిర్వహిస్తున్న ఈ దీక్షా దివస్ సభకు ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీశ్రేణులు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఫ దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నియోజకవర్గంలోని ముగ్గురు పేద దివ్యాంగులకు తన స్వంత డబ్బులతో ఎలక్ర్టిక్ ట్రైసైకిళ్లను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో శివ కిషోర్, మాధవి లచ్చయ్య, పోచమల్లు శివలకు వాటిని అందజేశారు. దివ్యాంగులు తమ రోజువారి అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనులు చేసుకునేందుకు ఈ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.